- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ఒప్పందాలపై మంత్రి గొట్టిపాటి కీలక కామెంట్స్
విద్యుత్ ఒప్పందాలపై మంత్రి గొట్టిపాటి కీలక కామెంట్స్ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: జగన్ ప్రభుత్వం(Jagan Government)లో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల(Electricity contracts)కు ఇప్పటికీ చాలా తేడా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravikumar) అన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి యాక్సిస్ కంపెనీ(Axis Company)తో ప్రభుత్వం ఒప్పంద చేసుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యాక్సిస్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం వందశాతం సక్రమమని చెప్పారు. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజీతో చేస్తున్న ప్రాజెక్టు ఇది అని, అది కూడా ఏపీ(Ap)లోనే పెట్టుబడులు పెట్టడం సంతోషమని చెప్పారు. గతంలో వైఎస్ జగన్(Ys Jagan) చేసుకున్న ఒప్పందాలన్నీ స్వలాభం కోసమేనన్నారు. జగన్ ఒప్పందాలకు, కూటమి ఎంఓయూలకు చాలా తేడా ఉందని చెప్పారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలు అలాంటివి మానుకుంటే మంచిదని హితవు పలికారు. విద్యుత్ కొనుగోళ్లలో జగన్ చేస్తున్న అసత్యాలు ప్రచారాలను నమ్మొద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు.






