Gottipati Ravi Kumar : ‘సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం’.మంత్రి ఆగ్రహం

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-29 02:02:24  IST  )

ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు

Gottipati Ravi Kumar : ‘సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం’.మంత్రి ఆగ్రహం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి కృషి చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు పై ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ మీటర్ల వల్ల అధికంగా బిల్లులు వస్తున్నాయని ప్రచారంతో చాలా మంది వినియోగదారులు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ మీటర్ల బిగింపు పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. వీటి గురించి సోషల్ మీడియా(Social Media)లో తప్పుడు ప్రచారం జరుగుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగానికి వీటిని బిగించే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravikumar) ఆదేశించారు. ప్రజామోదం లేనిదే ఏ విషయంలో ముందుకు వెళ్లకూడదన్నారు. ఈ తరుణంలో స్మార్ట్ మీటర్ల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ఉందని మంత్రి గొట్టిపాటి తెలిపారు.

Next Story