రాయలసీమలో హైకోర్టు బెంచ్.. మంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రి ఫరూక్ కీలక ప్రకటన చేశారు..

రాయలసీమలో హైకోర్టు బెంచ్.. మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు(Kurnool)లో హైకోర్టు బెంచ్(High Court) ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచి ఆ ప్రాంత వాసులను డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కలను నెరవేర్చేందుకు 2014-19లో తెలుగుదేశం పార్టీ(Telugudesam Party) అడుగులు వేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం స్థానిక ప్రాంతాలను పరిశీలించింది. కానీ ఎన్నికలు రావడంతో టీడీపీ(Tdp) ఓటమి పాలైంది. వైసీపీ(Ycp) ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. కర్నూలును మూడో రాజధాని చేస్తామంటూ ప్రకటించింది. హైకోర్టును ఆ ప్రాంతానికి తరలిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రాంతాన్ని కూడా ఎంపిక చేసింది. అయితే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరీ ఘోరంగా ఓడిపోయింది. కర్నూలు మూడో రాజధాని, హైకోర్టు అంశం మరుగున పడిపోయింది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ, ఆ ప్రాంత వాసుల చిరకాల కోరికను నెరవేర్చేందుకు కసరత్తులు చేస్తోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.


అయితే తాజాగా మంత్రి ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యే నాగేశ్వరరెడ్డి(Mla Nageswara Reddy) అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ స్థానికంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తోందని చెప్పారు. రాయలసీమ వాసుల కోసం కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను కచ్చితంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు స్థలానికి సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తే ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.

Next Story