- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News:మానవత్వం చాటుకున్న మంత్రి దుర్గేష్
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) మానవత్వం చాటుకున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) మానవత్వం చాటుకున్నారు. నేడు(శుక్రవారం) మంత్రి దుర్గేష్ పలు సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు బాపట్ల(Bapatla) వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో బస్సు, ట్రాక్టర్ ఒకదానినొకటి ఢీకొనడంతో ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనను చూసిన మంత్రి దుర్గేష్ తక్షణమే కాన్వాయ్‌ని ఆపి క్షతగాత్రుల వద్దకు వెళ్లి ఆక్సిడెంట్ పై పూర్తి సమాచారం తెలుసుకున్నారు.
అనంతరం అంబులెన్స్‌కి ఫోన్ చేసి గాయాలపాలైన వారిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఈ నేపథ్యంలో క్షతగాత్రులకు ధైర్యం చెప్పి స్థానిక ఆస్పత్రికి ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రాణ నష్టమేమీ జరగలేదని.. దయచేసి అందరూ రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని మంత్రి దుర్గేష్ ట్విట్టర్ వేదికగా కోరారు.






