- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశ్వవ్యాప్తంగా ఏపీ పేరు.. నెల కష్టపడ్డామంటూ మంత్రి డోలా సంచలన వ్యాఖ్యలు
యోగా డేపై మంత్రి డోలా సంచలన వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో ఈ రోజు ‘యోగా డే’ (Yoga Day) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డు(Ginnis Book Record) సాధించింది. ఈ నేపథ్యంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి(Minister Dola Balaveeranjaneya Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పిలుపుతో యోగా డేలో ప్రజలు భారీగా పాల్గొన్నారని, వారందరికి తాను కృతజ్ఞతలు చెబుతున్నారన్నారు. ‘యోగా డే’ను విజయవంతం చేసేందుకు నెల రోజు పాటు అధికారులతో పాటు కూటమి నేతలు చాలా కష్టపడ్డారని తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారం, సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరుదైన రికార్డును సాధించిందని చెప్పారు. గిన్నిస్ రికార్డు రికార్డుతో ఏపీ పేరును విశ్వవ్యాప్తం చేశారని మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి ప్రశంసలు కురిపించారు.
కాగా విశాఖలో యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ(Pm Modi)తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh), తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. దాదాపు 5 లక్షల మందితో ఈ యోగా డేలో పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. ఈ మేరకు మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. యోగా డేకు కూటమి నేతలు చేసిన కృషిని గుర్తు తెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు.






