గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. మంత్రి డీబీవీ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ లభించింది...

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. మంత్రి డీబీవీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల(Village and ward secretariat employees)కు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి(Minister Dola Bala Veeranjaneya Swamy) గుడ్ న్యూస్ తెలిపారు. రేషనలైజేషన్(Rationalization) పేరుతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏ ఒక్క ఉద్యోగిని కూడా తీసివేయమని ఆయన స్పష్టం చేశారు. రేషనలైజేషన్‌పై ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. శాస్త్రీయంగానే పని విభజన చేస్తున్నామని చెప్పారు. ‘ఏ’ కేటగిరిలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారని తెలిపారు. మరో కేటగిరిలో మహిళా పోలీసులను చేర్చుతామన్నారు. ఒక్కో సచివాలయంలో 7 నుంచి 8 మంది మంది ఉద్యోగులు ఉండేలా రేషనలైజేషన్ చేస్తామని చెప్పారు. పని భారం తగ్గించేందుకు కృష్టి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగుల్లో బదిలీలు ఉండవని, సీనియార్టీతో పదేన్నతలకు ఓ ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

Next Story