- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్.. 10వేల కంటే ఎక్కువ జీతం ఉంటే పథకాలకు అనర్హులే
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై నేడు ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై నేడు ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించవని అన్నారు. ఇది ఇంతకుముందు నుండే వస్తుందని చెప్పారు. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఆదాయం ఎంత ఉన్నా ఇందులో వెసులుబాటు కల్పించారని అన్నారు.
వారు ప్రభుత్వ పథకాలకు అర్హులేనని చెప్పారు. మిగితా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో జీతం ఎంత ఉన్నా ప్రభుత్వ పథకాలకు అనర్హులేనని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ జీతం, పట్టణ ప్రాంతాల్లో లక్షా 44వేల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే పథకాలు వర్తించవని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వ పథకాలు పొందుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని దానిపై విచారణ జరుపుతామని అన్నారు.






