- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమర వీరుడికి కన్నీటి వీడ్కోలు.. మురళీనాయక్ శవపేటిక మోసిన మంత్రి
భారత్‌కు పాకిస్థాన్ తో జరిగిన పోరాటంలో అమరుడైన వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

దిశ,వెబ్‌డెస్క్: భారత్‌కు పాకిస్థాన్ తో జరిగిన పోరాటంలో అమరుడైన వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. దేశ రక్షణే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు లో వీరమరణం పొందిన ఏపీ(Andhra Pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లా వాసి జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి స్వగ్రామం కళ్లితండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వీర జవాన్‌ను కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో వీరజవాన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ తరుణంలో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అమర వీరుడి భౌతికకాయం ఉన్న శవపేటికను స్వయంగా తన భుజాలపై మోసి అందరినీ కదిలించారు. మురళి నాయక్ పార్థివ దేహానికి పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ ఓదార్చారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత్ ఉగ్రమూకల స్థావారలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన ఘటనను గుర్తు చేశారు. ఈ క్రమంలో భారత్–పాక్ ఉద్రిక్తతల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారని పేర్కొన్నారు. ఈ తరుణంలో ‘చనిపోతే భారత జెండా కప్పుకుని చనిపోతా’ తల్లిదండ్రులతో మురళీ నాయక్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.






