బాబుది కంపు నోరు.. రామోజీవి కంపు రాతలు: బొత్స సత్యనారాయణ

by Disha Web Desk 12 |
బాబుది కంపు నోరు.. రామోజీవి కంపు రాతలు: బొత్స సత్యనారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మూడు ప్రాంతాలకు సమీపంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే చంద్రబాబుకు, రామోజీరావులకు కడుపు మండుతోంది అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గంటకో మాట, ఘడియకో విమర్శ చేసే చంద్రబాబుది కంపునోరైతే, రామోజీరావువి కంపు రాతలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ఒక పండుగ వాతావరణంలో అభివృద్ధి పనులుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపనలు చేస్తే కొందరు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి బలవంతంగా భూములను సేకరించలేదని చెప్పుకొచ్చారు. ఆంధ్రుల ఆరాధ్యుడైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నాడు, నేడు ఒకే నోరుతోనే మాట్లాడుతున్నారు. చంద్రబాబులా.. నాలుగు నాలుకలతో, బాబుకు మద్ధతుగా మీరంతా నాలుగైదు నీళ్లతో మాట్లాడినట్లు మా నాయకుడు వ్యవహరించడం లేదు అని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఎల్లో మీడియా ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో.. ఎంతమందిని దోచుకున్నారనేది, ప్రజలేంత మానసిక క్షోభ అనుభవించారనేది, ఈ రాష్ట్రంలో బాబు దుష్ట కూటమి జరిపిన ఘోరకలిని వైఎస్ జగన్ పదేపదే చెప్తున్నారని అన్నారు. అవినీతికి తావులేకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

నాడు నేడు ఒకటే మాట

భోగాపురం విమానాశ్రయానికి ఇక్కడ 12 వేల ఎకరాలు అవసరం అని చంద్రబాబు అంటే అంత అవసరం లేదని సీఎం జగన్ నాడు చెప్పారని గుర్తు చేశారు. నేడు అదే సీఎం వైఎస్ జగన్ 2300 ఎకరాలకు కుదించి ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక బృహత్తర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని తెలిపారు.

రాబోయే రోజుల్లో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మారుతున్న తరుణంలో ఇక్కడి ప్రాంతానికి అవసరమైన ప్రాజెక్టు వచ్చింది అని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం దాదాపు 30 నెలల కాలంలోనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కోరడం.. 2025 డిసెంబర్‌నాటికి మొదటి విమానాన్ని ఇక్కడ్నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు సన్నద్ధం చేస్తామని విమానాశ్రమ నిర్మాణ సంస్థ యాజమాన్యం కూడా బహిరంగంగా ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. ఆ ప్రాంత వాసిగా, రాష్ట్రంలో బాధ్యత కలిగిన పౌరుడిగా తాను ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.


Next Story

Most Viewed