- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu Case: తెలంగాణ స్పీకర్ పోచారంపై మంత్రి బొత్స మండిపాటు
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు..

X
దిశ, వెబ్ వెస్క్: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన తీరును చాలా మంది నేతలు ఖండిస్తున్నారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టారు. రాజకీయాల్లో కక్ష సాధింపులు సరికాదని సూచించారు. దీంతో మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం చట్టం ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ వ్యాఖ్యలు సరికాదన్నారు. పోచారం లాంటి వ్యక్తులు రాజకీయం కోసం మాట్లాడొచ్చని, కానీ వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదని విమర్శించారు. తెలంగాణలో ఇలాంటి తప్పులు చేస్తే వదిలివేయవచ్చా అని.. సీఎం కేసీఆర్‌ను అడగాలని బొత్స హితవు పలికారు.
Next Story






