- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్షణ సాయం అందించండి: కేంద్రమంత్రికి మంత్రి అచ్చెన్న లేఖ
తక్షణ సాయం అందించాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌కి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు...

దిశ, వెబ్ డెస్క్: పత్తి రైతుల(Cotton farmers) కష్టాలపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్(Union Minister Giriraj Singh)కు మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) లేఖ రాశారు. 2025–26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరగిందని, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని లేఖలో పేర్కొన్నారు. అయితే మొంథా తుఫాన్(Montha Typhoon) ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే సీఎం యాప్ (CM APP, ఆధార్ ఆధారిత ఈ-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు పూర్తిగా డిజిటలైజ్ చేసిందని చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App)ను రాష్ట్ర సీఎం యాప్ (CM APP)తో అనుసంధానం చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అచ్చెన్న వివరించారు. రైతుల సౌకర్యం కోసం పలు చర్యలు తీసుకోవాలని కోరారు. కాపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) నుండి సీఎం యాప్ (CM APP)కు రైతు వివరాలు రియల్ టైమ్‌లో సమన్వయం అయ్యేలా చేయాలన్నారు. రైతులు తమ సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునే విధంగా మ్యాపింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
‘‘L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. కాపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) కోసం గుంటూరులో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించాలి. వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ శాతం 12 నుండి 18% వరకు ఉన్న పత్తిని కూడా అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలి. వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని కూడా తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలి.ఈ చర్యలు రైతులలో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించి, పత్తి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని, సహజ విపత్తుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలి.’’ అని మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు






