ఆ ధైర్యం ఉందా..? వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు సవాల్

by Vemula.Srinu Prasad |

వ్యవసాయంపై చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని వైసీపీ నేతలకు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు....

ఆ ధైర్యం ఉందా..? వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: వ్యవసాయం(Agriculture)పై చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని వైసీపీ నేతల(YCP Leaders)కు మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) సవాల్ విసిరారు. అమరావతి(Amaravati)లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా వాటి అనుబంధ సంస్థలను కూడా వైసీపీ నాయకులు నాశనం చేశారని వ్యాఖ్యానించారు. వ్యవసాయాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోందని తెలిపారు. గతంలో ధాన్యం సేకరించి డబ్బులు ఇచ్చే వారని కాదని ఆరోపించారు. కానీ ఇప్పుడు ప్రతి గింజకు డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. ప్రకృతి విపత్తులు, తుపానులకు దెబ్బతిన్న ధాన్యాన్ని కూడా సేకరిస్తున్నామని చెప్పారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Next Story