- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
National Handloom Day: రాష్ట్ర ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక పిలుపు
ఇవాళ(ఆగస్టు 07) జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజలకు, చేనేత కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: ఇవాళ(ఆగస్టు 07) జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజలకు, చేనేత కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేత అనేది భారతదేశ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందని అన్నారు. గ్రామీణ జీవిత శైలిని ప్రతిబింబించే చేనేత రంగం దేశ ఆర్థిక, సాంస్కృతిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోంది. చేనేత ఉత్పత్తులలో ఉన్న నైపుణ్యం, విలక్షణతకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించే దిశగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. అలాంటి రంగానికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నేటి నుంచి ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. అలాగే, చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని భరించనుంది. దీంతో పాటు త్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి రూ.5 కోట్లు విడుదల చేయనుంది. చేనేత కళను ప్రోత్సహిస్తూ, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విధానాలు రూపొందిస్తున్నదని తెలిపారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.






