జగన్‌కు మించిన కోడి బుర్ర పేర్ని నానిదే: మంత్రి అచ్చెన్న

by Vemula.Srinu Prasad |

చీజ్‌కు, నెయ్యికి తేడా తెలియని తమకు BRIDGE అనే ఆటకు, పేకాటకు ఏమి తేడా తెలుస్తుందిలే జగన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు...

జగన్‌కు మించిన కోడి బుర్ర పేర్ని నానిదే: మంత్రి అచ్చెన్న
X

దిశ, వెబ్ డెస్క్: చీజ్‌కు, నెయ్యికి తేడా తెలియని తమకు BRIDGE అనే ఆటకు, పేకాటకు ఏమి తేడా తెలుస్తుందిలే వైఎస్ జగన్(Ys Jagan) అంటూ మంత్రి అచ్చెన్నాయుడు(Minsiter Atchannaidu) సెటైర్లు వేశారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ(Mega DSC)లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీనేతలు చేస్తున్న రాద్దాంతంపై ఆయన మండిపడ్డారు. గొడ్డలి పార్టీకి నరకడం, చంపడం, వేట్లు వేయడం బాగా తెలుసు అని, ఉద్యోగాలు, నోటిఫికేషన్లపై అర్థం చేసుకునే బుర్రలు ఎక్కడ ఉన్నాయన్నారు. జగన్‌కు మించిన కోడి బుర్ర పేర్ని నాని లాంటి వారిదేనని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

గొడ్డలి పార్టీ సిద్ధాంతమే విధ్వంసం..

డీఎస్సీ జరగకుండా కోర్టుల్లో వందల కేసులు వేశారని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఆ కేసులను ఎదుర్కొని యువతకు ఉద్యోగాలు ఇస్తే, ఇప్పుడు జగన్ మోహన్ అది కూడా తట్టుకోలేక ఉద్యోగాలు పొందిన యువతపై విషం చిమ్ముతున్నాడని మంత్రి అచ్చెన్నాడు మండిపడ్డారు.

Next Story