రికార్డు సమయంలో పూర్తి చేస్తాం: మూలపేట పోర్టు పనులపై మంత్రి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

మూలపేట పోర్టు నిర్మాణ పనుల్లో గత ప్రభుత్వానిది నత్తనడక అయితే మన ప్రభుత్వానిది జెట్ స్పీడ్ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు...

రికార్డు సమయంలో పూర్తి చేస్తాం: మూలపేట పోర్టు పనులపై మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మూలపేట పోర్టు(Mulapeta Port) నిర్మాణ పనుల్లో గత ప్రభుత్వానిది నత్తనడక అయితే మన ప్రభుత్వానిది జెట్ స్పీడ్ అని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu ) అన్నారు. మూలపేట పనుల ఆలస్యంపై వైసీపీ(Ycp) నాయకులు చేసిన విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మే 2024 నాటికి ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి మార్చి 2026 నాటికి మనం సాధించిన ప్రగతి ఏమిటనేది గణాంకాలే సాక్ష్యమన్నారు. దక్షిణ బ్రేక్ వాటర్ పనులు మే 2024 నాటికి కేవలం 1750 మీటర్ల కోర్ ప్లేసింగ్ పనులు పురోగతిలో ఉండగా మార్చి 2026 నాటికి 26.20 లక్షల మెట్రిక్ టన్నుల రాక్ ప్లేసింగ్ 47766 కాంక్రీట్ ఆర్మర్ కాస్టింగ్, ప్లేసింగ్ పనులు పూర్తి చేశామని చెప్పారు. ఉత్తర బ్రేక్ వాటర్స్ విషయానికి వస్తే మే 2024 నాటికి కేవలం 580 మీటర్ల కోర్ ప్లేసింగ్ పనులు జరిగితే అదే మార్చి 2026 నాటికి 2.62 లక్షల మెట్రిక్ టన్నుల రాక్ ప్లేసింగ్ 6674 కాంక్రీట్ ఆర్మర్ యూనిట్ల కాస్టింగ్, ప్లేసింగ్ పనులు వంద శాతం పూర్తి చేశామని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.

వేగవంతం చేశాం..

‘‘జనరల్ కార్గో బెర్త్ పనులు మే 2024 నాటికి పైలింగ్, బీమ్ పనులు పురోగతిలో ఉండగా మార్చి 2026 నాటికి పైల్స్ డి-వాల్, ప్రీకాస్ట్ యూనిట్లు పూర్తి చేసి ఇన్-సిటు బీమ్స్, స్లాబ్ పనులు వేగవంతం చేశాం. కోల్ బెర్త్ పనులు మే 2024 నాటికి అసలు ప్రారంభమే కాలేదు కానీ మార్చి 2026 నాటికి 40 పైల్స్ 995 ప్రీకాస్ట్ యూనిట్ల కాస్టింగ్, 59 యూనిట్ల ప్లేసింగ్ పనులు పూర్తి చేశాం. ఆన్-షోర్ ఇన్ఫ్రా పనులు మే 2024 నాటికి ప్రారంభం కాకపోయినా మార్చి 2026 నాటికి క్యాంటీన్ కస్టమ్స్ బిల్డింగ్, గేట్ కాంప్లెక్స్‌ల రూఫ్ స్లాబ్ పనులు పూర్తి చేశాం.’’ అని మంత్రి అచ్చెన్న వెల్లడించారు.

రికార్డు సమయంలో పూర్తి చేస్తాం:

‘‘ఎక్స్టర్నల్ రోడ్ ఎంబ్యాంక్మెంట్ పనులు మే 2024 నాటికి కేవలం 6.80 శాతం మాత్రమే ఉంటే మార్చి 2026 నాటికి సబ్-గ్రేడ్ జిఎస్‌బి డబ్ల్యూఎమ్ఎమ్, స్ట్రక్చర్ పనులతో కలిపి మొత్తం 30.87 శాతం పనులు పూర్తి చేశాం. మేజర్ బ్రిడ్జి రైల్ ఎంబ్యాంక్మెంట్, ఎక్స్టర్నల్ వాటర్ సప్లై పనులు మే 2024 నాటికి ప్రారంభం కానప్పటికీ మార్చి 2026 నాటికి బ్రిడ్జి పైల్ క్యాప్ పనులు 22.04 శాతం రైల్ ఎంబ్యాంక్మెంట్ పనులు, 19.97 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు పూర్తి చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే మూలపేట పోర్టును రికార్డు సమయంలో పూర్తి చేస్తాం.’’ అని మంత్రి అచ్చెన్న ధీమా వ్యక్తం చేశారు.

Next Story