- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: మన భద్రతే.. మన కుటుంబానికి శ్రీరామరక్ష..!
మన భద్రతే మన కుటుంబానికి శ్రీరామరక్ష అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ వినూత్నంగా ఏర్పాటు చేసిన ‘అభయం హెల్మెట్ బ్యాంక్’ స్టాల్‌ను గౌరవ సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పరిశీలించారు...

దిశ, వెబ్ డెస్క్: మన భద్రతే మన కుటుంబానికి శ్రీరామరక్ష అని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ(Srikakulam District Police Department) వినూత్నంగా ఏర్పాటు చేసిన ‘అభయం హెల్మెట్ బ్యాంక్’(Abhayam Helmet Bank) స్టాల్‌ను గౌరవ సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం పోలీసులు సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమం 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర'(Swarna Andhra — Swacha Andhra) ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. సీఎం చంద్రబాబు స్వయంగా హెల్మెట్ ధరించి, బుల్లెట్ వాహనంపై కూర్చొని ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, సురక్షితంగా ప్రయాణించాలని కోరుకున్నారు. శ్రీకాకుళం పోలీస్ శాఖ చేపట్టిన వినూత్న ప్రయత్నానికి మంత్రి అచ్చెన్నాయుడుఅభినందనలు తెలిపారు.






