- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్వారీ ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
by Naga Rani Yarlagadda |
బాపట్ల క్వారీ ప్రమాద ఘటనపై (Bapatla Quarry Accident) జిల్లా ఇన్ ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బాపట్ల క్వారీ ప్రమాద ఘటనపై (Bapatla Quarry Accident) జిల్లా ఇన్ ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ తరహా ఘటనలు రిపీట్ అవ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
ఆదివారం ఉదయం బల్లికురవ గ్రామ సమీపంలో గల సత్యక్రిష్ణ గ్రానైట్ క్వారీ (Satya Krishna Granite Quarry)లో బండరాళ్లుపడి ఆరుగురు కార్మికులు మరణించగా.. 10 మంది గాయపడ్డారు. వారందరినీ నరసరావుపేట ఆస్పత్రికి తరలించగా.. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. క్వారీ ప్రమాదంలో మరణించిన కార్మికుల్ని ఒడిశా వాసులుగా గుర్తించారు.
Next Story






