వందలాది మంది వచ్చి విధ్వంసం చేస్తున్నారు: మంత్రి అచ్చెన్న హాట్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-09 11:14:37  IST  )

మాజీ సీఎం జగన్ పర్యటన కు వందలాది మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి విధ్వంసం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.....

వందలాది మంది వచ్చి విధ్వంసం చేస్తున్నారు: మంత్రి అచ్చెన్న హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్(Former CM Jagan) పర్యటన కు వందలాది మంది వైసీపీ(Ycp) కార్యకర్తలు వచ్చి విధ్వంసం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) అన్నారు. చిత్తూరు జిల్లా(Chittoor District)లో జగన్ పర్యటన దృష్ట్యా తలెత్తిన ఉద్రిక్తలపై ఆయన స్పందించారు. సమస్యలు సృష్టించడానికే జగన్ పర్యటన అని మండిపడ్డారు. జగన్ పర్యటన ప్రాంతాన్ని డ్రోన్ల ద్వారా చిత్రీకరించామని చెప్పారు. వాళ్ల మళ్లీ బుకాయించకుండా ముందు జాగ్రత్త పడ్డామని తెలిపారు. చిత్తూరు జిల్లా వైసీపీ నేత ప్రకాశ్ రెడ్డి(YSRCP leader Prakash Reddy) డ్రామా సృష్టించారు. గత పొలం దగ్గరకు జగన్ వెళ్లగానే.. ట్రాక్టర్లలో మామిడి తీసుకొచ్చి రోడ్లపై పోశారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ ఆ మామిడిని తొక్కుకుంటూ వెళ్తారా అని అచ్చెన్న ప్రశ్నించారు.

శాంతి భద్రతలకు విఘాతం కల్గించాలన్నదే వాళ్ల ఉద్దేశమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలని ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఐదారు జిల్లాల నుంచి జనసమీకరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జగన్ పర్యటనలకు డబ్బులు ఇచ్చి మరీ జనసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. వందమీటర్ల దూరంలో హెలిప్యాడ్ అనుమతి ఇస్తామంటే ఒప్పుకోలేదని చెప్పారు. క్రిమినల్ ఆలోచనలు, సెట్టింగులతో జగన్ పర్యటన చేశారని మంత్రి అచ్చెన్న విమర్శించారు.

Next Story