- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాశీబుగ్గలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) చేరుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) చేరుకున్నారు. దుర్ఘటన గురించి తెలుసుకున్న వెంటనే మంత్రి హుటాహుటినా బయలుదేరి అక్కడకు వెళ్ళారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. బాధిత కుటుంబాల వారిని ప్రత్యక్షంగా కలిసి వారిని ఓదార్చారు. ప్రైవేటు వ్యక్తులు (Private) నిర్వహిస్తున్న దేవాలయంలో జరిగిన దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీనిచ్చారు. రద్దీ నియంత్రణకు అదనపు దళాలను మొహరించడంతో పాటు అత్యవసర చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.






