- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతాళానికి తొక్కేశారు: జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
వైఎస్ జగన్ ప్రభుత్వం కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించిందని, తద్వారా అభివృద్ధిని పూర్తిగా పాతాళానికి తొక్కేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు....

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వం కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించిందని, తద్వారా అభివృద్ధిని పూర్తిగా పాతాళానికి తొక్కేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. టెక్కలి నియోజకవర్గం చీపుర్లపాడు(Cheepurlapadu)లో రూ.10.51 కోట్లతో నిర్మించనున్న MSME పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలో ఉండగా "నాకెంత.. నీకెంత" అంటూ దోచుకున్న ఆ 'గొడ్డలి పార్టీ'కి ప్రజాస్వామ్యంలో ప్రజలే బుద్ధి చెప్పారని అచ్చెన్న విమర్శించారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీని శాశ్వతంగా పాతాళానికి పంపడం ఖాయమన్నారు.
ఆనాడు విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసి, ఆ భూములను ఆక్రమించుకోవాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి రూ.15 వేల కోట్లు మంజూరు చేయించి ఉక్కు పరిశ్రమను కాపాడుతున్నారని అచ్చెన్న పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంతో కేవలం 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించామని చెప్పారు. గూగుల్, రిలయన్స్ వంటి దిగ్గజాలు ఏపు వైపు చూస్తున్నాయన్నారు.యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రథమ ప్రాధాన్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
2029 నాటికి 100% పూర్తి చేస్తాం
‘‘శ్రీకాకుళం జిల్లాలో వలసలను అరికట్టేందుకు, స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల స్థాపన ఎంతో అవసరం. జిల్లా ప్రగతిని అడ్డుకునే స్వార్థపరుల మాటలు నమ్మకుండా, ప్రజలంతా పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలి. అలాగే నియోజకవర్గ తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.620 కోట్లు మంజూరు చేశాం. జిల్లా ప్రజల 60 ఏళ్ల సుదీర్ఘ కల అయిన 'నేరడి బ్యారేజీ'ని సీఎం చంద్రబాబు పట్టుదల, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో 2029 నాటికి 100% పూర్తి చేసి, ప్రతి బీడు భూమికి సాగునీరందించి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం.’’ అని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.






