విభజన పాపం.. ఇంకా వినిస్తున్న విమర్శలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-09 09:27:04  IST  )

పార్వతీపురం మన్యం జిల్లా విభజన విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు..

విభజన పాపం.. ఇంకా వినిస్తున్న విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాను గత ప్రభుత్వం రెండుగా విభజించిన విషయం తెలిసిందే. అయితే పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటుతో పలు సమస్యలు తలెత్తాయి. దీంతో శ్రీకాకుళం జిల్లా విభజన విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు సైతం విమర్శలు కురిపించారు. గత ప్రభుత్వం జిల్లా విభజనలను అస్తవ్యస్తంగా చేసిందని ఆయన మండిపడ్డారు. ఒక ప్లాన్ ప్రకారం చేయలేదని, దాని వల్ల చాలా సమస్యలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో పర్యటించిన ఆయనకు జిల్లా విభజనతో తలెత్తిన సమస్యలను పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గిరిజన యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందే విధంగా అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సైతం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, గత ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధిని విస్మరించిందని, కనీసం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు.


‘‘కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల‌ అభివృద్ధికి ఏడాది కాలంలో రూ. 1000 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.230 కోట్ల నిధులు మంజూరు చేశాం. గిరిజన యువతకు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన నిధులను మంజూరు చేశాం. గత ప్రభుత్వం ఐదేళ్లు పాలనలో ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తున్నాయి. స్త్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఈ నెల 15 న ప్రారంభం. తొలి విడతలో రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు మొత్తం రూ .7 వేలు అన్నదాత సుఖీభవ నిధులు అందచేశాం.’’ అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Next Story