రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీలు.. భర్తీపై మంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-23 15:29:10  IST  )

ఏపీలో సచివాలయ సిబ్బంది(కి మంత్రి అనగాని ప్రసాద్(Minister Angani Prasad) గుడ్ న్యూస్ తెలిపారు

రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీలు.. భర్తీపై మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సచివాలయ సిబ్బంది(Secretariat Staff)కి మంత్రి అనగాని ప్రసాద్(Minister Angani Prasad) గుడ్ న్యూస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ(Registration Department)లో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల సంఘం డైరీ(Employees Association Diary)ని గుంటూరులో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టులను సచివాలయ సిబ్బందితో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖకు వీలైనంత త్వరగా కొత్త బిల్డింగులను నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ప్రజలతో మమేకమై మరింత సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులకు సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు రద్దు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story