- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లాలో మంత్రి ఆనం పర్యటన.. బోరున ఏడ్చిన రైతులు
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. మంత్రి రాకతో రైతులు బోరున విలపించారు. ఆదుకోవాలని కోరారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకోలేక, పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షాలు, ఈదురుగాలులకు పంటలు మునిగి, కొన్ని పంటలు నేలరాలడంతో రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులంతా విన్నవిస్తున్నారు. తాజాగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో దెబ్బతిన్న పంటల్ని ఆయన పరిశీలించారు. ఆపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడగా.. అకాల వర్షం తమను తీవ్రకష్టాల్లోకి నెట్టిందంటూ బోరున విలపించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని మంత్రికి వివరించారు.
అకాల వర్షం వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లడం చాలా బాధాకరమని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే 1200 హెక్టార్లలో పంట దెబ్బతిందన్నారు. పంట నష్టాల నివేదికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే పరిహారం అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు.






