మహానాడుకు స్థలాలు పరిశీలించాం... ఒకట్రెండు రోజుల్లో పనులు: మంత్రి ఆనం

by Vemula.Srinu Prasad |

మహానాడుకు పలుచోట్ల స్థలాలను పరిశీలించామని, నివేదికను జాతీయ పార్టీకి పంపామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు..;.

మహానాడుకు స్థలాలు పరిశీలించాం... ఒకట్రెండు రోజుల్లో పనులు: మంత్రి ఆనం
X

దిశ, వెబ్ డెస్క్: మహానాడు(Mahanadu)కు పలుచోట్ల స్థలాలను పరిశీలించామని, నివేదికను జాతీయ పార్టీకి పంపామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Minister Anam RamanarayanaReddy) తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో పసుపు పండగ పనులు ప్రారంభం అవుతాయని ఆయన చెప్పారు. 44 ఏళ్ల కిందట ఎన్టీఆర్ టీడీపీ(Ntr Tdp) స్థాపించినప్పటి నుంచి మహానాడు జరుగుతోందని, మహానాడుని నెల్లూరు(Nellore)లో నిర్వహించాలని సీఎం చంద్రబాబు, లోకేష్(Lokesh) నిర్ణయించారని మంత్రి ఆనం వివరించారు. ఉత్తరాంధ్రలో ప్రఖ్యాత పరిశ్రమలకు శంకుస్థాపనలు జరిగాయని గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు వస్తారని మంత్రి ఆనం స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో రెండోదైన గూగుల్‌కి శంకుస్థాపన జరిగిందని, అందుకే శ్రీకాకుళంలో నిర్వహించ తలపెట్టిన మహానాడుని నెల్లూరుకి మార్చామని చెప్పారు. నెల్లూరులో తొలిసారి మహానాడు జరగబోతోందన్నారు. ప్రాంతీయ పార్టీగా పుట్టిన టీడీపీ.. నేడు జాతీయ పార్టీగా ఎదిగిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

Next Story