- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు.. మంత్రి అనగాని సంచలన కామెంట్స్
ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని మంత్రి అనగాని సత్య ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దివ, డైనమిక్ బ్యూరో: ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని మంత్రి అనగాని సత్య ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తిరుపతిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనగాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. (Parakamani theft case) పరకామణి చోరీ కేసులో సీఐడీ అధికారుల గడువు రేపటితో పూర్తి అవుతున్న నేపథ్యంలో నిందితులు ఎవరనేది బయటపడుతుందని అని మంత్రి చెప్పారు. పరకామణి కేసులో తప్పు చేసినవారు తప్పించుకోలేరని, దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ చేసుకోవడం చరిత్రలో జరగని, వినని విషయం అని తెలిపారు. విచారణ గురించి వ్యంగ్యంగా మాట్లాడే అర్హత భూమన కరుణాకర్ రెడ్డికి లేదన్నారు. అన్ని అబద్ధాలు చెప్పి, భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని ఆరోపించారు. సూత్రదారి, పాత్రధారి ఆయనే కాబట్టి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రేణిగుంట సబ్ రిజిస్ట్రర్ నియామకంలో ఆనంద్ రెడ్డి కోర్టును ఆశ్రయించారని, ఆ వ్యవహారంలో తప్పు ఉంటే ఐజీ, డీఐజీ చర్యలు తీసుకుంటారని అన్నారు. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసుల్లో తప్పులు చేశామని ఒప్పుకుంటూనే, తాము చేయలేదని, ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారని విమర్శించారు. ఇక, జిల్లాలో 2 లక్షల పది వేల మందికి రూ.113 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 17 నెలల్లో రూ. 51 వేల కోట్లు పెన్షన్స్ అందించామని స్పష్టం చేశారు. తిరుపతిని అభివృద్ధి చేయడం కోసం సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతిని ఎకో సిస్టం టౌన్ షిప్‌గా, న్యూ కన్వెన్షన్‌గా, టూరిజం హబ్‌గా కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.






