- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడలో అర్ధరాత్రి కుండపోత వర్షం.. వరదలో చిక్కుకున్న బస్సు!
విజయవాడలో శనివారం అర్దరాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో బస్టాండ్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఓ బస్సు వరదలో చిక్కుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో శనివారం అర్దరాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో బస్టాండ్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఓ బస్సు వరదలో చిక్కుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను జాగ్రత్తగా బయటకు దింపారు. తరవాత వారిని అక్కడ నుండి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. విజయవాడ సిటీతో పాటు క్రిష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గుడివాడ బెల్టులో 70mm నుండి 100mm రికార్డు స్థాయి వర్షాపాతం నమోదైంది. అంతే కాకుండా కాకినాడ జిల్లా పెద్దాపురంలోనూ 146mmతో భారీ వర్షాపాతం నమోదైంది. విజయనగరం, శ్రీకాకుళంలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
Next Story






