- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘2013లో ఒక టీచర్‌గా చంద్రబాబును కలిశా.. ఆయన ఏమన్నారంటే’.. హోంమంత్రి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్ర(Andhra Pradesh) ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా(Visakhapatnam District) పరిషత్ సమావేశ మందిరంలో 2025-డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నేడు(శుక్రవారం) జరిగింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర(Andhra Pradesh) ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా(Visakhapatnam District) పరిషత్ సమావేశ మందిరంలో 2025-డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నేడు(శుక్రవారం) జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) పాల్గొన్నారు. హోం మంత్రిని ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ఐక్యతగా ఉద్యోగులు పని చేస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. అంబేద్కర్ భావజాలం ఇంకా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.
ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకోకూడదు అని చెప్పారు. అందరిలాగే చదువుతున్నాం. అందరిలాగే ఉద్యోగాలు చేస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని సూచించారు. దేశ ప్రజలు అందరి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. ఈ క్రమంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఒక టీచర్‌గా 2013లో సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను. చంద్రబాబు(CM Chandrababu) ఏమి చదువుకున్నావ్ అని అడిగారు. నాకు అన్ని విధాలుగా చేయూత ఇచ్చినది సీఎం చంద్రబాబు అని తెలిపారు. మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి చదువు. ఆ చదువే నాకు రాజకీయాల్లో పెట్టుబడి అయింది అని తెలిపారు. ఎస్పీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.






