Ap: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. లేదంటే పెళ్లి బృందం పని అయ్యేదే...!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-01 17:30:53  IST  )

బస్సులో వెళ్తున్న పెళ్లి బృందం సభ్యులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది..

Ap: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. లేదంటే పెళ్లి బృందం పని అయ్యేదే...!
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి బృందం లేచిన సమయం బాగుంది.. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. మరికొన్ని గంటల్లో వివాహం జరగనుంది. దీంతో అంతా రెడీ అయి బస్సులో పెళ్లి జరిగే ఊరికి బయల్దేరారు. ఇంతలో షాకింగ్ ఘటన ఎదురైంది. అదుపు తప్పి బస్సు లోయ వైపు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్.. పెళ్లి బృందం సభ్యులను డ్రైవింగ్ సీటు వైపు కిటికీ నుంచి కిందకు దింపారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద జరిగింది. మారేడుమిల్లి నుంచి పెళ్లి బృందం బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం తప్పింది. దీంతో పెళ్లిబృందం ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రేన్ సాయంతో బస్సును పక్కకు తీశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story