- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Megastar Chiranjeevi:అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు

దిశ,వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్‌ను(Allu Arjun) చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయల్దేరారని వార్తలు వచ్చాయి.. కానీ చిరంజీవి వెళ్లింది అల్లు అర్జున్ నివాసానికి అని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి చేరుకున్నారు. వీరితో పాటు నాగబాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి తన సినిమా షూటింగ్‌ను రద్దు చేసుకుని హుటాహుటిన బన్నీ ఇంటికి చేరుకున్నారు. ఉదయం నుంచి జరిగిన పరిస్థితులపై ఆరా తీశారు. భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్ భార్య, తల్లి, ఇతర కుటుంబ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి ధైర్యం చెప్పారు. అటు బన్నీ తండ్రి అరవింద్, సోదరుడు శిరీష్ చిక్కడపల్లి పీఎస్ వద్ద ఉన్నారు.