- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మెగా పీటీఎం'కు గిన్నిస్‌బుక్‌లో స్థానం.. మంత్రి లోకేష్ రియాక్షన్ ఇదే
by Naga Rani Yarlagadda |
ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్ (MEGA PTM) గిన్నిస్ ప్రపంచ రికార్డులో చోటు దక్కించుకుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్ (MEGA PTM) గిన్నిస్ ప్రపంచ రికార్డులో చోటు దక్కించుకుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రికార్డు ఉపాధ్యాయులకు అంకితమని ప్రకటించారు. జాతీయ విద్యావిధానం ఐదవ వార్షికోత్సవం జులై29కి ఒకరోజు ముందు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డు సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం మెగా పీటీఎంలో 5.34 మిలియన్ల పేరెంట్స్, టీచర్స్ పాల్గొన్నారు. అలాగే స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు.. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వారితో కలిపి 15.2 మిలియన్ల మంది ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో భాగస్వాములయ్యారు.
Next Story






