బ్రేకింగ్ న్యూస్... మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల

by Muthe.Rajitha |

ఏపీ మెగా డీఎస్సీ(AP Mega DSc) అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.

బ్రేకింగ్ న్యూస్... మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మెగా డీఎస్సీ(AP Mega DSc) అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ లిస్టును ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచామని ఏపీ పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. "జోన్ ఆఫ్ కన్సిడరేషన్"లోకి వచ్చిన అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ వివరాలు నమోదు చేస్తే కాల్ లెటర్ అందుతుందని తెలిపింది. దాదాపు 16 వేలకు పైగా వివిధ విభాగాల పోస్టుల వివరాలు వెల్లడిస్తామని డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరు కావాలని పేర్కొంది.

Next Story