నేడు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం

by Thanuru Gopichand |

నేడు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అధ్యక్షతన సచివాలయంలో సమావేశం (Meeting) జరగనుంది.

నేడు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అధ్యక్షతన సచివాలయంలో సమావేశం (Meeting) జరగనుంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ విభాగాలకు చెందిన విభాగాధిపతులు హాజరుకానున్నారు. వృద్ధి రేటు పెంచేలా వచ్చే 4 నెలల్లో తీసుకోవాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. అదే విధంగా మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సీఎం సమీక్షను నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే రానున్న మూడు, నాలుగు త్రైమాసికాల్లో ఏ విధంగా ముందుకు సాగాలి. ప్రణాళికలను ఏ విధంగా రూపొందించాలి. రూపొందించిన ప్రణాళికలను సమర్థవంతంగా ఎలా అమలు చేయాలి.. తద్వారా సాధించాల్సిన లక్ష్యాలు ఏమిటనే అంశంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

అదే విధంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ది పొందుతున్న వారి వివరాలు.. అర్హులకు పథకాల ప్రయోజనం చేకూరేలా తీసుకోవాల్సిన చర్యల గురించిన అంశాలు చర్చకు రానున్నట్లు తెలియవస్తోంది. పౌరసేవల విషయంలో ఇటీవలే వాట్సాప్ గవర్నన్స్ పై సీఎం ప్రకటన చేశారు. ప్రజలకు ప్రభుత్వం తరపున మెరుగైన సేవలను అందించేందుకు సాంకేతికతను ఏ విధంగా వినియోగించాలనే దానిపై కూడా ఈ సమావేవంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమరావతితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కూడా సీఎం సమీక్షించనున్నారని.. ప్రధానంగా జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్స్, సూపర్ సిక్స పథకాల అమలు, దస్త్రాల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లు చర్చకు రానున్నట్లు సమాచారం. అదే విధంగా ప్రజల అర్జీల పరిష్కారంపై సీఎం చంద్రబాబు నాయుడు విభాగాధిపతులకు సూచనలను చేయనున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న రుణాలు, రీస్ట్రక్చరింగ్ పై శాఖలవారీగా సమీక్ష చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story