- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద నేతన్నలకు వైద్యసేవలు : మంత్రి సవిత
by Naga Rani Yarlagadda |
చేనేత కార్మికులకు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద నేతన్నలకు వైద్యసేవలు అందిస్తామని మంత్రి సవిత వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత కార్మికుల సమస్యలు, సంక్షేమంపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం రూ.120 కోట్ల ఆప్కో నిధులను దారిమళ్లించినట్లు తెలిపారు. ఆప్కో పేరిట తీసుకున్న బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికులకు ప్రోత్సాహాన్నిచ్చేలా తరచూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని వివరించారు. చేనేత, దాని ఉప ఉత్పత్తుల తయారీదారులకు కూడా సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పుకొచ్చారు.
Next Story






