- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను కూడా కోర్టుకు హాజరయ్యా: గత ప్రభుత్వంపై హోంమంత్రి అనిత ఫైర్
వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యకాలంలో మొత్తం 3,116 తప్పుడు కేసులు పెట్టిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు

దిశ, వెబ్ బెస్క్: వైసీపీ ప్రభుత్వం(Ycp Government) 2019 నుంచి 2024 మధ్యకాలంలో మొత్తం 3,116 తప్పుడు కేసులు పెట్టిందని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన తప్పుడు, అక్రమ కేసులపై శాసన మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో అమరావతి రైతులు(Amaravati Farmers) రాజధాని కోసం పోరాడితే వందలాది మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. తన పైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంతో కడప కోర్టు(Kadapa Court)కు తాను హాజరయ్యానని ఆమె తెలిపారు. అన్ని కేసులను లా ప్రకారం పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యమించిన టీచర్లపై నమోదైన కేసుల్లో 80 శాతం ఎత్తివేశామన్నారు. మిగిలిన కేసుల పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. పోలీస్ శాఖ, న్యాయ శాఖలతో సమన్వయంగా సమావేశమై కేసుల పరిష్కారంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.






