కవి అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలి : ఏపీ డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2025-11-10 06:22:49  IST  )

ప్రముఖ తెలుగు సాహితీవేత్త, గేయ రచయిత, కవి అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు.

కవి అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలి : ఏపీ డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ తెలుగు సాహితీవేత్త, గేయ రచయిత, కవి అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అయిన అందెశ్రీ (Ande Sri) హఠాన్మరణం తనకు దిగ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేశారన్నారు. తెలంగాణ జానపదాలపై, మాండలికంపై పట్టు కలిగిన రచయిత ఆయన అని గుర్తు చేసకున్నారు. పలు సినీ గీతాలు రచించారన్నారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు...’ గీతం వింటే సమాజాన్ని అందెశ్రీ ఎంతగా చదివారో అర్థమవుతుందన్నారు. ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ (Jaya Jayahe Telangana) అంటూ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించారన్నారన్నారు. రాష్ట్ర గీతంతో తెలంగాణ చరిత్రలో ఆయన చిరస్మరణీయంగా నిలిచారన్నారు. అందెశ్రీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అందెశ్రీ మృతి సాహితీ లోకానికి తీరని లోటు

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, జయజయహే తెలంగాణ గీతాన్ని రచించి కోట్లాదిమంది తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇక లేరు అనే వార్త అత్యంత బాధాకరం అని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు అనే పాటతో మనుషుల్లోని మానవత్వాన్ని తట్టి లేపిన గొప్ప కవి అందెశ్రీ అని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ అకాల మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

READ MORE ....

అందేశ్రీ మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు నాయుడు

Next Story