భోగి మంటలు కొత్త వెలుగులు తేవాలి.. తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు విషెస్

by Kema Shiva Kumar |

సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజైన భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

భోగి మంటలు కొత్త వెలుగులు తేవాలి.. తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranti) సంబరాల్లో భాగంగా మొదటి రోజైన భోగి (Bogi) పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలని తెలిపారు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు అందరి కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని కామెంట్ చేశారు. ఆశావహ దృక్పథంతో సాగే అందరి ఆలోచనలు సాకారం కావాలని.. అందుకు తాను అండగా ఉంటానని అన్నారు. అందరి జీవితాలు భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ, మరొక్కమారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.. అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

Next Story