విశాఖలో రూ. 100 కోట్లు వసూళ్లు.. బోర్డు తిప్పేసిన సంస్థ

by Vemula.Srinu Prasad |

విశాఖలో మాక్స్ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది...

విశాఖలో రూ. 100 కోట్లు వసూళ్లు.. బోర్డు తిప్పేసిన సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో మాక్స్ సంస్థ(Max company) ఘరానా మోసానికి పాల్పడింది. స్నేహ ముచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ పేరిట డిపాజిట్ల(Deposits) పేరుతో 2008 నుంచి వసూళ్లు చేసింది. 12 శాతం వడ్డీ ఇస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో 2500 మంది జనాలు డిపాజిట్లు చేశారు. రూ. 100 కోట్లు వసూలు అయిన తర్వాత బోర్డు తిప్పేశారు. దీంతో దువ్వాడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్స్ సంస్థ చైర్మన్, రిటైర్డ్ ఐఆర్ఎస్ శివభాగ్యరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రధానంగా రిటైర్డ్, ప్రభుత్వం ఉద్యోగుల నుంచే భారీగా డిపాజిట్లు సేకరించినట్లు తేలింది. మాక్స్ సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, సంస్థ డైరెక్టర్లు సీతామహాలక్ష్మి, విశ్వేశ్వరరావుతో పాటు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Next Story