- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనాధాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు
ఏపీ(Andhra Pradesh)లోని కృష్ణా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని కృష్ణా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమం (Little Lights Orphanage)లో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అనాధాశ్రమంలోని విద్యార్థులు నిద్రిస్తున్నారు. ఒక్కసారిగా గదిలోకి మంటలు ఎగిసిపడడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన ఆశ్రమం పక్కన ఉన్న ప్రార్థన మందిరంలో ఉన్న వారు, స్థానికులు వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు.
స్థానికులు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన పై అప్రమత్తమైన సిబ్బంది గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఆశ్రమంలో 140 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






