లాడ్జిలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

by Ajay Maddhiboyina |

ఏపీలోని క‌డ‌ప జిల్లాలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. రాజంపేట ప‌ట్ట‌ణంలోని రైల్వే స్టేష‌న్ రోడ్డులో దీప్ లాడ్జిలో భారీ అగ్రిప్ర‌మాదం సంభ‌వించింది.

లాడ్జిలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలోని క‌డ‌ప జిల్లాలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. రాజంపేట ప‌ట్ట‌ణంలోని రైల్వే స్టేష‌న్ రోడ్డులో దీప్ లాడ్జిలో భారీ అగ్రిప్ర‌మాదం సంభ‌వించింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో లాడ్జిలో39 మంది ఉండ‌గా బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఈ క్ర‌మంలో ఒక వ్య‌క్తి మంట‌ల్లోనే స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. మృతుడిని రాజంపేట సూపర్ కేమార్ట్ ఉద్యోగి శ్రీనివాసులు(35)గా గుర్తించారు. కొంద‌రు ఫ‌స్ట్ ఫ్లోర్ నుండి కిటికీల ద్వారా బ‌య‌ట‌కు దూకి ప్రాణాలు ర‌క్షించుకున్నారు. ప్ర‌మాదం జరిగిన త‌ర‌వాత అక్క‌డ‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు కొంత‌మందిని ర‌క్షించారు.

మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. ఈ ప్ర‌మాదంలో భారీగా ఆస్తిన‌ష్టం కూడా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. లాడ్జిలోని ఫ‌ర్నిచ‌ర్ అంతా కాలి బూడిద అయ్యింది. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే అగ్రిప్ర‌మాదం జ‌రిగింద‌ని అధికారులు ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణం వేడిగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఎండ‌లు మొద‌ల‌వ్వ‌డంతో ఫైర్ యాక్సిడెంట్స్ జ‌రిగే అవ‌కాశం ఉండ‌టం వ‌ల్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

Next Story