రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-28 10:17:20  IST  )

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణా సంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడులో 18 మంది మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. ..

రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి..?
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) సామర్లకోట(Samarlakota) మండలం వేట్లపాలెం(Vetlapalem) బాణా సంచా(Fire Works) తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడులో 18 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 20 మందిపైగా కార్మికులు చిక్కుకున్నారని, వీరిలో పదుల సంఖ్యలో కార్మికులు సజీవ అయ్యారని, పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు అంటున్నారు. ప్రమాద సమయంలో భారీ శబ్ధాలు వచ్చాయని, దీంతో కార్మికుల మృతదేహాలు చెల్లాచెదరం అయ్యాయని తెలిపారు. మరోవైపు ఘటనా స్థలంలో ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు అందిస్తున్నారు. పచ్చని పొలాల మధ్య బాణా సంచా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారని, ఇందుకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు అంటున్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు(Cm Chandrababu), హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha).. అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Next Story