BIG BREAKING: మారేడుమిల్లి టైగర్ జోన్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-18 05:24:38  IST  )

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో మంగళవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

BIG BREAKING: మారేడుమిల్లి టైగర్ జోన్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో మంగళవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కాల్పుల మోతతో మారేడుమిల్లి అటవీప్రాంతం దద్దరిల్లింది. ఈ ఎన్‌కౌంటర్ కు సంబంధించిన వివరాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. లోతట్టు అటవీప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతలు ఆశ్రయం పొందుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 6-7 గంటల సమయంలో పోలీసులు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో తుపాకులు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. కాల్పుల నేపథ్యంలో పాడేరు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.


Next Story