- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లూరి జిల్లాలో రూ.3.80 కోట్ల గంజాయి పట్టివేత
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో నేడు పోలీసులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో నేడు పోలీసులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 760 కిలోల గంజాయి విలువ సుమారు రూ.3.80 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిస్సా సరిహద్దులోని చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా.. గంజాయి రవాణాకు వాడిన కారును సీజ్ చేశారు. అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ ముఠా గుట్టు రట్టయింది.
ఒడిస్సా-ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్, విజయవాడ తదితర నగరాలకు గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ ముఠాలో ఉన్నది ఒడిస్సా-ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన వ్యక్తులే అని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారని సమాచారం.






