రెచ్చిపోయి పోలీసులపై స్మగ్లర్ దాడి.. రెండు రౌండ్లు కాల్పులు

by Vemula.Srinu Prasad |

నెల్లూరులో గంజాయి స్మగ్లర్ రెచ్చిపోయారు....

రెచ్చిపోయి పోలీసులపై స్మగ్లర్ దాడి.. రెండు రౌండ్లు కాల్పులు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)లో గంజాయి(Ganja) స్మగ్లర్ రెచ్చిపోయారు. గంజాయి రవాణాపై ఈగల్ టీమ్(Eagle Team) ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. అయితే నెల్లూరులో గంజాయి తరలింపును అడ్డుకునేందుకు ఈగల్ టీమ్ అధికారులు(Eagle Team Officials) ప్రయత్నం చేశారు. దీంతో స్మగ్లర్(smugglers) సూర్య ప్రకాశ్ హల్ చల్ చేశారు. ఈగల్ టీమ్ సభ్యుల(Eagle Team Members)ను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం స్మగ్లర్ సూర్యప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story