రాష్ట్రంలో మావోయిస్టులను పూర్తిగా నియంత్రిస్తాం : సీఎం

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో మావోయిస్టులను పూర్తిగా నియంత్రిస్తామని ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు.

రాష్ట్రంలో మావోయిస్టులను పూర్తిగా నియంత్రిస్తాం : సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మావోయిస్టులను పూర్తిగా నియంత్రిస్తామని ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. ఏపీలో నిర్వహించిన వాజ్ పేయీ శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుదేవ్ సాయ్ మాట్లాడుతూ.. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల సంఖ్య చాలా వరకూ తగ్గిందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ కు ఏపీకి అవినాభావ సంబంధం ఉందన్న ఆయన.. విశాఖపట్నం - రాయ్ పుర్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో సంబంధాలు మరింత పెరుగుతాయన్నారు. వాజ్ పేయీ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. డిసెంబర్ 25న అన్ని జిల్లాల్లో అటల్ పార్కులను ప్రారంభిస్తున్నట్లు విష్ణుదేవ్ వెల్లడించారు.

Next Story