- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని.. శ్రీవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు వీఐపీ బ్రేక్ దర్శనాల ద్వారా శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ(శుక్రవారం) పలువురు ప్రముఖులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు.
వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు తెల్లవారుజామున మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగరియా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అయితే వీరందరూ వేరు వేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.






