- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP NDA Manifesto : కూటమి మేనిఫెస్టో.మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక సాయం
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ కీలక నేతలు కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కీలక అంశాలను తెలిపారు. అందులో ఆంద్రరాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్ధిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే మత్స్యకారుల బోట్ల మరమ్మత్తులకు కూడా కూటమి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు మేనిఫెస్టోలో తెలిపారు. ఇదిలా ఉంటే తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయాల్లో దాదాపు రెండు నుంచి మూడు నెలల పాటు వేటను నిషేధిస్తారు. ఆ సమయంలో మత్స్యకారుల జీవనం కొనసాగించడం కోసం ప్రతి సంవత్సరం ప్రభుత్వం 6 వేల రూపాయల వరకు నగదు ఇస్తారు. కాగా దానిని టీడీపీ కూటమి రూ. 20 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.






