- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chandrababu Naidu: తిరుమల భక్తులకు మ్యాంగో జ్యూస్..!
పంటల వారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

మధ్యాహ్న పథకంలో కూడా అందించే అంశం పరిశీలించాలి..
రైతులు నష్టపోకుండా డిమాండ్ ఉన్న పంటల్ని మాత్రమే సాగయ్యేలా చూడాలి..
రైతాంగ సమస్యపై ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో చర్చిస్తా..
ఈ ఏడాది హెచ్డీ బర్లే పొగాకు రకానికి క్రాప్ హాలిడే
క్యాబినెట్ సబ్ కమిటీతో టెలికాన్ఫరెన్స్నిర్వహించిన సీఎం చంద్రబాబు
దిశ, డైనమిక్ బ్యూరో : పంటల వారీ సాగు ప్రణాళికపై (Cultivation plan) వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏ పంటలు ఎంతమేర విస్తీర్ణంలో సాగు చేయాలో రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్, సప్లయ్ మధ్య సమతూకం ఉంటుందన్నారు. పొగాకు, కోకో, మామిడి, ధాన్యం రైతుల సమస్యలపై సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం అధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీ క్ష జరిపారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. పంటల ప్రణాళిక అనేది చాలా శాస్త్రీయంగా జరగాలని, జాతీయ అంతర్జాతీయ ప్రరిణామాలు, మార్కెట్లు, దిగుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్టీజీఎస్, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టిపెట్టాలన్నారు.
రైతుల దగ్గర ఉన్న కోకో పంట (Cocoa crop) నిల్వలను కేజీ రూ.500కు కంపెనీల ద్వారా కొనుగోళ్లు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ప్రస్తుతం 1,200 మెట్రిక్ టన్నుల నుంచి 1500 మెట్రిక్ టన్నుల కోకో నిల్వలు ఉన్నాయని... వీటిలో 600 మెట్రిక్ టన్నులు మాత్రమే రైతుల దగ్గర ఉన్నాయని వాటిని మాత్రమే కొనుగోళ్లు చేయాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సుమారు 20,000 మిలియన్ కేజీల మేర రాష్ట్రంలో రైతుల దగ్గరున్న హెచ్డీ బర్లే పొగాకు (HD Burley Tobacco) నిల్వలను కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. హెచ్డీ బర్లే, వైట్ బర్లే రకాలను టొబాకో బోర్డులో చేర్చాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. అలాగే ఈ వారం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రైతాంగ సమస్యలపై చర్చిస్తానని సీఎం తెలిపారు. మామిడి రైతులు ఆందోళన చెందకుండా తక్షణమే పల్ప్ ప్రాసెసింగ్ (Pulp processing) కంపెనీలు కొనుగోళ్లు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా అధికారులు చూడాలని సీఎం అన్నారు.
మ్యాంగో పల్ప్ జ్యూస్ వినియోగం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్ధులకు అందించడంతో పాటు... తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ మ్యాంగో జ్యూస్ అందించే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో టొమాటో ప్రాసెసింగ్ (Tomato processing) యూనిట్లు పెరిగేలా ప్రోత్సహించి.. రైతులు ఆశించిన ధర వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్య లేదని, ఏ ప్రాంతాల్లో అయితే తడి చిన ధాన్యం(grain) ఉందో వాటిని కూడా కొనుగోలు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదండ్ల మనోహర్, గొట్టిపాటి రవి, రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదిత రులు పాల్గొన్నారు






