సంచలన నిర్ణయం తీసుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

by Malleboina Mahesh |   (  Updated:2023-12-30 06:34:02  IST  )

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి పొమ్మనలేక పొటబెట్టారని వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

సంచలన నిర్ణయం తీసుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి పొమ్మనలేక పొటబెట్టారని వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పీకర్ ఫార్మట్లో ఆర్కే రాజీనామా చేశారు. తాజాగా ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అలాగే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం నిజమే అయితే తాను ఆమె వెంటే నడుస్తానని ఆర్కే తేల్చి చెప్పారు. నా నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నారా లోకేష్ ఓడించిన నాకు సహకారం అందించకపోతే ఎలా అన్ని ప్రశ్నించారు. అలాగే తాను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా చంద్రబాబు, లోకేష్‌పై కేసులు వేస్తాను.. సీఎం జగన్ కూడా ఏమైనా తప్పులు చేస్తే అవసరమైతే వారిపై కూడా కేసులు వేస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Next Story