Manda Krishna: సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ..

by Kema Shiva Kumar |   (  Updated:2024-08-25 14:57:44  IST  )

సీఎం చంద్రబాబుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు.

Manda Krishna: సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ..
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఇవాళ హైదరాబాద్‌లోని బాబు నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని సీఎం చంద్రబాబుకు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో వస్తున్న వ్యతిరేకత గురించి చంద్రబాబుతో ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది.

Next Story