- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manchu Manoj : చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్
సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu)తిరుపతి యూనివర్సిటీ(University)వద్ధ నిన్న జరిగిన గొడవ నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj)ఈ రోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్(Chandragiri Police Station)కు వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu)తిరుపతి యూనివర్సిటీ(University)వద్ధ నిన్న జరిగిన గొడవ నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj)ఈ రోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్(Chandragiri Police Station)కు వెళ్లారు. నిన్న జరిగిన ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని తన తాత, నాయనమ్మ, సోదరుడి సమాధుల వద్ధ నివాళులర్పించేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే యూనివర్సిటీ సిబ్బందితో పాటు తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణులు, వారి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని, తనపై దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.
కాగా నిన్న మనోజ్, మౌనిక దంపతులు యూనివర్సిటీకి వెళ్లగా కుటుంబ వివాదం నేపథ్యంలో వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అటు యూనివర్సిటీ హక్కుల వివాదంపై కోర్టులో వివాదం సాగుతోంది. ఇంజక్షన్ ఆర్డర్ సైతం మోహన్ బాబు పొందారు. పోలీసులు మనోజ్ ను నిన్న యూనివర్సిటీకి వెళ్లవద్దని నోటసులు కూడా జారీ చేశారు. అయినప్పటికి మనోజ్ అక్కడికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ వివాదంలో పరస్పరం మోహన్ బాబు, మనోజ్ లు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై చర్చించేందుకు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీతో భేటీ అయ్యారు.






